ఏపీ రాజధానిపై కేంద్ర హోంశాఖ దిద్దుబాటు

ఏపీ రాజధాని అంశంపై సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాన్ని కేంద్ర హోంశాఖ సరిదిద్దుకుంది. ప్రస్తుతం 3రాజధానుల అంశం కోర్టుపరిధిలో ఉందని తెలిపింది.

Updated : 14 Jul 2021 11:47 IST

గతంలో ఇచ్చిన సమాధానం సరైనది కాదని అంగీకారం

దిల్లీ: ఏపీ రాజధాని అంశంపై సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాన్ని కేంద్ర హోంశాఖ సరిదిద్దుకుంది. ప్రస్తుతం 3రాజధానుల అంశం కోర్టుపరిధిలో ఉందని తెలిపింది. 3రాజధానుల అంశంపై చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో కేంద్ర హోంశాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్‌ ఈ నెల 6న సమాధానమిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020 ప్రకారం రాష్ట్రంలో 3పరిపాలన కేంద్రాలుంటాయి. వాటిని రాజధానులు అంటారు. రాష్ట్ర రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుంది’ అని అందులో పేర్కొన్నారు. ఈ సమాధానంపై అమరావతి జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.వి.ఆర్‌.శాస్త్రి అభ్యంతరం చెబుతూ కేంద్ర హోంశాఖ అప్పిలేట్‌ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్‌కు ఈనెల 9న లేఖ రాశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రం తరఫున సీపీఐవో తప్పుడు సమాచారమిచ్చారని పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు. లేఖతో స్పందించిన కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్‌ రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉందంటూ తాను గతంలో ఇచ్చిన సమాధానానికి భిన్నంగా బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని