Kishan Reddy: భారత్‌ తరహాలో ఏ దేశం రెస్క్యూ ఆపరేషన్‌ చేయట్లేదు: కిషన్‌రెడ్డి

ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 

Published : 28 Feb 2022 13:54 IST

విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి

హైదరాబాద్‌: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయంలో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అనుభవం ఉన్న అధికారుల సలహాలు తీసుకుంటున్నామని.. భారత్‌ తరహాలో ఏ దేశం రెస్క్యూ ఆపరేషన్‌ చేయట్లేదని కిషన్‌రెడ్డి వివరించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల తరలింపుపై ప్రధాని రోజుకు నాలుగు సార్లు సమీక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని