Telangana debts: రాష్ట్రం ఏర్పాటు తర్వాత భారీగా పెరిగిన తెలంగాణ అప్పులు: కేంద్రం

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Updated : 13 Feb 2023 15:10 IST

దిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022 అక్టోబర్‌ నాటికి రూ.4.33 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పులుగా వీటిని పేర్కొంది. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి రూ.75,577 కోట్ల అప్పులుంటే.. 2021-22 నాటికి అవి రూ.2,83,452 కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు రూ. 1.50 లక్షల కోట్లు, 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1.30 లక్షల కోట్లుగా ఉన్నాయని పంకజ్‌ చౌదరి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని