పేదలకు మరో 5 నెలలు ఆహారధాన్యాలు 

దేశవ్యాప్తంగా పేదలకు మరో అయిదు నెలలపాటు అదనంగా ఆహారధాన్యాలను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రభావం నుంచి పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నవంబరు వరకు ఈ ఆహార ధాన్యాలను కేటాయించడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

Updated : 24 Jun 2021 13:41 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పేదలకు మరో అయిదు నెలలపాటు అదనంగా ఆహారధాన్యాలను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రభావం నుంచి పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నవంబరు వరకు ఈ ఆహార ధాన్యాలను కేటాయించడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఒక్కోవ్యక్తి నుంచి నెలకు ఐదు రూపాయల చొప్పున వసూలు చేసి ఈ ఆహార ధాన్యాలను అందించనున్నట్లు తెలిపింది. జాతీయ ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే 81 కోట్ల మందికి కేంద్రం తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. రాష్ట్రాలపై ఎలాంటి భారం మోపకుండా కేంద్రమే పూర్తిగా ఈ పథకాన్ని అమలు చేయనుందని వివరించింది. దీనికోసం కేంద్రంపై రూ.64,031 కోట్ల భారం పడనుందని అధికారిక వర్గాలు అంచనా వేశాయి. రవాణ, సరఫరా, రేషన్‌ షాపులకు సంబంధించిన ఛార్జీలకు మరో రూ.3,234 కోట్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ప్రభుత్వంపై మొత్తం రూ.67,266 కోట్ల భారం పడనుంది. గోధుమలు, బియ్యం కేటాయింపులకు సంబంధించి ఆహార, పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని