AP News: చర్చిలకు ఎంపీల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక ఏదీ?: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ ర........

Published : 27 Nov 2021 15:33 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ రమ్య ఏపీ సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు. ఎంపీలకు ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40లక్షలకు పైగా నిధుల్ని ఎంపీ నందిగామ సురేశ్‌ చర్చిలకు వినియోగించినట్టుగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెండు నెలల క్రితం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పీఎంవోకు లేఖ రాశారు.

ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన ఈ నిధుల్ని నిధుల్ని మత సంబంధ కార్యక్రమాలకు, మతపరమైన భవనాల నిర్మాణాలకు ఖర్చుచేస్తున్నట్టుగా వచ్చిన కథనాలను ఆయన పీఎంవోకు నివేదించారు. దీంతో పాటు రాష్ట్రంలో మతమార్పిడులకు కూడా ఈ నిధులు వినియోగిస్తున్నట్టు ఆయన లేఖ రాశారు. ఈ లేఖపై రెండు నెలల క్రితమే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించినా.. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక పంపాలని తాజాగా కేంద్రం లేఖ రాసింది. ఇప్పటికే నివేదిక కోరినా పంపించలేదని, అందుకే మరోసారి గుర్తు చేస్తున్నట్టు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి నివేదిక పంపాలని లేఖలో డైరెక్టర్‌ రమ్య కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని