Zika Virus: జికా కలకలం.. మహారాష్ట్రకు కేంద్ర బృందం

మహారాష్ట్రలో జికా వైరస్‌ తొలి కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇటీవల పుణె జిల్లాలో తొలి జికా వైరస్‌ కేసు వెలుగుచూసింది.

Published : 02 Aug 2021 19:24 IST

దిల్లీ: మహారాష్ట్రలో జికా వైరస్‌ తొలి కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇటీవల పుణె జిల్లాలో తొలి జికా వైరస్‌ కేసు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో జికా వ్యాప్తికి సంబంధించి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులున్న అత్యున్నత అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ఆ వైరస్‌ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బృందం తోడ్పాటు అందించనున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.  తాజాగా పంపిన బృందం రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి పని చేస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తుందని వెల్లడించింది. జికా నియంత్రణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర సర్కారు అమలు చేస్తోందో.. లేదో అంచనా వేయనున్నట్టు తెలిపింది. వైరస్‌ నియంత్రణకు అవసరమైన సూచనలను రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందిస్తుందని పేర్కొంది.

పుణెకు చెందిన బెల్సార్ గ్రామంలో ఓ మహిళకు ఇటీవల జికా వైరస్ సోకింది. అయితే ఆమె శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తక్కువగానే ఉన్నట్టు వైద్యాధికారి డాక్టర్‌ ప్రదీప్‌ అవాటే పేర్కొన్నారు. ఆ మహిళ కుటుంబంలో మరెవరికీ వైరస్‌ సోకలేదని వెల్లడించారు. ఈ వైరస్‌కు సంబంధించి ప్రత్యేకమైన చికిత్స ఏదీ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని