Mother: తల్లికి ఎందుకిలా...? కారణాలు ఏంటో తెలుసా..!

గర్భధారణ జరిగిన తర్వాత మూడు నెలలు గడిస్తే ముప్పు తప్పిపోయినట్టే అనుకుంటాం..కానీ కొంతమందిలో మూడు నెలల తర్వాత కూడా గర్భస్రావం అవుతుంది. ఎక్కువగా 12-24 వారాల మధ్యలో గర్భస్రావం కావడానికి ఎన్నో కారణాలున్నాయి. కొంతమందికి 9 నెలలకు ముందే కాన్పు అవుతుంది. ఈ సమస్యకు గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉండటమే కారణమని వైద్యులు చెబుతున్నారు.

Published : 06 Aug 2022 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గర్భధారణ జరిగిన తర్వాత మూడు నెలలు గడిస్తే ముప్పు తప్పిపోయినట్టే అనుకుంటాం.. కానీ కొంతమందిలో మూడు నెలల తర్వాత కూడా గర్భస్రావం అవుతుంది. ఎక్కువగా 12-24 వారాల మధ్యలో గర్భస్రావం కావడానికి ఎన్నో కారణాలున్నాయి. కొంతమందికి 9 నెలలకు ముందే కాన్పు అవుతుంది. ఈ సమస్యకు గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉండటమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్‌ భావన చెప్పారు.

జెనెటిక్స్‌ సమస్య కారణమా..?

పుట్టుకతోనే జెనెటిక్స్‌ సమస్య ఉంటే గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉంటుంది. ఇలాంటి వారికి తరచుగా గర్భస్రావం కావడంతో పాటు తొందరగా ప్రసవం అయిపోతుంది. పుట్టుకతో సమస్యలు వచ్చే వారికి గర్భధారణ కంటే ముందే కౌన్సిలింగ్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైన కొన్ని పరీక్షలు కూడా చేయాల్సి వస్తుంది. ఇంకొంత మందికి కవలలున్నపుడు బరువు మోయలేక గర్భస్రావం అయ్యే వీలుంది. ఇలాంటి వారికి చిన్న కుట్టు వేయడంతో ఇబ్బందులు తలెత్తవు. వెజైనా, సర్విక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా కూడా సమస్యలు వస్తాయి. గత ప్రసవంలో ఉమ్మనీరు తొందరగా పడిపోవడం, శస్త్రచికిత్స చేసిన సందర్భంలో మళ్లీ గర్భధారణకు ప్రయత్నించినపుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇలా గుర్తించవచ్చు..!

* పొత్తి కడుపులో ఒత్తిడి పెరిగినట్టు అనిపించినపుడు గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉన్నట్టు గమనించాలి.

* నడుంనొప్పితో పాటు అప్పుడప్పుడూ రక్తస్రావం కావడం, యోనిలో స్రవాలు కనిపించడం, పురిటి నొప్పిలా అనిపించినపుడు అనుమానించాలి.

* ఇలాంటప్పుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తే గర్భాశయ ముఖద్వారం ఎలా ఉందో తెలిసిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని