Polavaram: పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించాలని కుట్ర జరుగుతోంది: చలసాని

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు135 అడుగులకు కుదించాలనే కుట్ర జరుగుతోందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, రైతాంగ సమాఖ్య నాయకులు యేర్నేని నాగేంద్రనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Published : 03 Jun 2023 21:16 IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు135 అడుగులకు కుదించాలనే కుట్ర జరుగుతోందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, రైతాంగ సమాఖ్య నాయకులు యేర్నేని నాగేంద్రనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.  ఎంపీల జీతాలు పెరగాలి, ప్రజాప్రతినిధులు రూ.వందల కోట్లతో ఇళ్లు కట్టుకోవాలి కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మాత్రం పెంచరా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగితే ఎంపీలు నోరు విప్పరని, ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా షాపుల ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోండి కానీ, కేంద్రం వద్ద మాత్రం అన్ని పార్టీలు ఒక్కటిగా ఉండాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని