Andhra news: మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.. సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు

డిప్యూటీ సీఎం, మంత్రులకు ఛాంబర్‌లను కేటాయిస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Published : 18 Jun 2024 20:24 IST

అమరావతి: డిప్యూటీ సీఎం, మంత్రులకు ఛాంబర్‌లను కేటాయిస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్‌-2లో ఏడుగురు, బ్లాక్‌-3లో ఐదుగురు,  బ్లాక్‌ -4లో ఎనిమిది మంది, బ్లాక్‌-5లో ఐదుగురు మంత్రులకు ఛాంబర్లను కేటాయించింది. బ్లాక్‌-2లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నాదెండ్ల మనోహర్‌, నారాయణ, కందుల దుర్గేశ్‌, అనిత, పయ్యావుల కేశవ్‌, ఆనం రామనారాయణరెడ్డిల ఛాంబర్లు ఉంటాయి. బ్లాక్‌-3లో మంత్రులు గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎన్‌ఎండీ ఫరూక్‌లకు, బ్లాక్‌-4లో అనగాని సత్యప్రసాద్‌, అచ్చెన్నాయుడు, సవిత, టీజీ భరత్‌, లోకేశ్‌, రాం ప్రసాద్‌రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడుకి కేటాయించారు. బ్లాక్‌-5లో బీసీ జనార్థన్‌రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి, సత్యకుమార్‌ల ఛాంబర్లు ఉంటాయని సాధారణ పరిపాలనశాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని