తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

రానున్న 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని కామారెడ్డి, సంగారెడ్డి,

Updated : 06 Apr 2021 17:26 IST

హైదరాబాద్‌: రానున్న 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజులు పొడి వాతావరణం ఏర్పడనుందని పేర్కొంది. తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కి.మీ. వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఇవాళ బలహీనపడినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని