Ap News: స్టూడెంట్ లీడర్‌ అనుభవంతోనే రాజకీయాల్లో ఎదిగా: చంద్రబాబు

నేటి యువత, నిపుణులు రాజకీయాల్లోకి రావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తెదేపాలో ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన 28 మంది విద్యార్థులు, నిపుణులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు. రెండు నెలల పాటు పార్టీలోని వివిధ విభాగాల్లో, వివిధ అంశాలపై చేసిన పరిశోధనను...

Updated : 12 Jan 2022 19:20 IST

అమరావతి‌: నేటి యువత, నిపుణులు రాజకీయాల్లోకి రావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తెదేపాలో ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన 28 మంది విద్యార్థులు, నిపుణులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు. రెండు నెలల పాటు పార్టీలోని వివిధ విభాగాల్లో, వివిధ అంశాలపై చేసిన పరిశోధనను నివేదిక రూపంలో అందించారు. ఇంటర్న్ షిప్ చేసిన 28 మందికి ధ్రువీకరణ పత్రాలను చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా వారితో కొద్ది సేపు ముచ్చటించారు.  ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల పట్ల యువత ఆసక్తి చూపడం లేదు. విద్యార్థులు సైతం రాజకీయాలను, నేతలను పరిశీలించాలి. ప్రజా విధానాలు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయి. నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్ లీడర్‌గా పనిచేసిన అనుభవంతోనే రాజకీయాల్లో ఎదిగాను. నేటి రాజకీయాలను, నేతలను చూసి యువత ‘మా కర్మ’ అని అనుకుంటున్నారు. విద్యార్థులు, యువత ఒక గమ్యంతో ముందుకు వెళ్లాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని