
Chandrababu: సహాయక చర్యలు చేపట్టండి: పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచన
అమరావతి: ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయచర్యలకు సమన్వయకర్తలుగా తెదేపా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి పరసా రత్నం, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లను సమన్వయకర్తలకుగా నియమించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.