Chandrababu: చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

తెదేపా అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది.

Updated : 22 Sep 2023 11:33 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న ఆయన్ను పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. రిమాండ్‌ సమయం ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు. తన హక్కులను రక్షించాలని.. న్యాయాన్ని కాపాడాలని కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని