చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన అమరావతి రైతులు

గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై వీక్షించారు.

Updated : 12 Jun 2024 12:22 IST

తుళ్లూరు: ఏపీ సీఎంగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడంతో తెదేపా నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై అమరావతి రూపకర్త చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. జై అమరావతి, జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. నంద్యాల జిల్లా గడివేములలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మహిళలు ఎల్‌ఈడీ స్క్రీన్లలో తిలకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని