Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

Updated : 13 Jun 2024 16:05 IST

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని