PM Modi: ప్రధాని మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Published : 12 Jun 2024 11:14 IST

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు చంద్రబాబు స్వాగతం పలికారు. తెదేపా అధినేతతో పాటు 24 మంది మంత్రులు కేసరపల్లిలో నిర్వహించే సభలో ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్‌ తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని