Polavaram: చంద్రబాబు పోలవరం సందర్శన .. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామానాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Published : 16 Jun 2024 21:13 IST

జంగారెడ్డిగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం.. పోలవరం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత అధికారులతో మంత్రి సమీక్షించారు. నిర్మాణ పనుల్లో ప్రతి అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తారని, అనంతరం అధికారులతో సమీక్షిస్తారని రామానాయుడు వెల్లడించారు.

ఐటీడీఏ పీవో సూర్య తేజ, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఇతర శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అధికారులకు సీఎం పర్యటన నేపథ్యంలో పలు సూచనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం మొదటిసారి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేస్తున్న నేపథ్యంలో.. పర్యటనకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేసి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని