Chandrababu: నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Published : 20 Jun 2024 10:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఆయన పోస్టు చేశారు. ‘‘ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

అమ్మ ప్రేమే నాకు పెద్ద బలం: నారా లోకేశ్‌

నారా భువనేశ్వరికి ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ బర్త్‌డే విషెష్‌ తెలిపారు. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. ఆమె ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల ఆమె చూపే అంకితభావం స్ఫూర్తిదాయకమన్నారు. రోజూ అమ్మను ఆరాధిస్తానని తెలిపారు. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేస్తున్న ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని లోకేశ్‌ ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని