TSLPRB: ఎస్సై, కానిస్టేబుల్‌ తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు

ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. మొత్తం నాలుగు పరీక్ష తేదీలను మారుస్తూ కొత్త తేదీలను ప్రకటించింది.

Updated : 13 Jan 2023 15:29 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్షల (మెయిన్స్‌) తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. ఈ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) చేసిన విజ్ఞప్తి మేరకు తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీకి, కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ వెల్లడించింది.

రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు. ప్రాథమిక పరీక్షా ఫలితాలను కూడా టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ వెల్లడించింది. సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిందరికి దేహధారుడ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి తుది పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుది పరీక్షను తొలుత ప్రకటించిన తేదీల్లో కాకుండా కొత్త తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని