AP: ఐఏఎస్‌ల నివేదిక ఆమోదంలో మార్పులు

ఏపీ కేడర్‌ అఖిల భారత సర్వీసు అధికారుల వార్షిక నివేదిక ఆమోదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.

Updated : 10 Apr 2021 14:24 IST

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ 

అమరావతి: ఏపీ కేడర్‌ అఖిల భారత సర్వీసు అధికారుల వార్షిక నివేదిక ఆమోదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. వార్షిక పనితీరు నివేదికలు ఆమోదించే అధికారం సీఎంకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల నివేదికలు సీఎంకు అందజేయనున్నారు. అధికారుల పనితీరు, ప్రవర్తన మదింపు చేసే అధికారం కూడా సీఎంకు అప్పగించారు. 

మెరుగైన ఫలితాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ వెల్లడించారు. గవర్నర్‌ కార్యదర్శి పని తీరు నివేదిక గవర్నర్‌ ఆమోదిస్తారని ఆయన వెల్లడించారు. సీఎం ఆమోదించిన నివేదికల ఆధారంగానే బదిలీలు, పోస్టింగ్‌లు ఉంటాయని సీఎస్‌ వివరించారు. కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి అఖిలభారత సర్వీస్‌ అధికారులకు అవకాశం ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని