Published : 01 Jul 2022 01:49 IST

urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జ్వరం వచ్చినా, నడుంనొప్పి ఉన్నా, అన్నం తినడం ఇష్టం లేకపోయినా వైద్యులు రక్త పరీక్షతో పాటు మూత్ర పరీక్ష కూడా చేయిస్తారు. ఎందుకో తెలుసా ప్రాణాంతక వ్యాధులే కాదు శరీరంలో ఎలాంటి రుగ్మత ఉందో ఇట్టే తెలిసిపోతుంది. మనం సాధారణంగా విసర్జించే మూత్రం తెల్లగా, లేత పసుపు రంగులో ఉంటుంది. పసుపు, ఎరువు రంగుల్లో ఉంటే తప్పనిసరిగా అనుమానించాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కిడ్నీ, కాలేయానికి సంబంధించిన వ్యాధుల గురించి మూత్రంలో మార్పులు సంకేతాలు ఇస్తాయి. 

* మూత్రం పచ్చగా వస్తే వేడి చేసిందని కామెర్లు సోకాయని అనుకుంటాం. నిజానికి పసుపు రంగు కామెర్లు వచ్చాయని తెలిసిపోతుంది. బీ కాంప్లెక్సు విటమిన్లు తీసుకున్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది. 

* మూత్రం పాలలాంటి నురగతో వస్తుంటే  మూత్ర వ్యవస్థలో ఎక్కడో ఇన్‌ఫెక్షన్‌ సమస్య ఉందని తెలుస్తోంది. 

* మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తున్నపుడు కాలేయం జబ్బు సంకేతంగా భావించాలి. 

* కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు, క్యాన్సర్‌ ఆనవాళ్లు ఉన్నపుడు మూత్రం ఎరుపు రంగులో వస్తుంది. తరచుగా మూత్రంలో రక్తం కూడా పడుతుంది. 

* బీట్‌రూట్‌, స్ట్రాబెర్రీలాంటి పండ్లు తిన్నపుడు కూడా మూత్రం ఎరువు రంగులో కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని