Tirumala: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో చిరుత కలకలం

తిరుమలలో చిరుత కలకలం రేపింది. చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు దానిని అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published : 25 Mar 2023 21:45 IST

తిరుమల: తిరుమల(Tirumala)లో చిరుత కలకలం రేపింది. మొదటి కనుమ దారిలోని 35వ మలుపు వద్ద చిరుతపులి (Leopard) సంచరించింది. దీంతో తిరుపతికి వెళ్లుతున్న వాహన చోదకులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన వాహనదారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు, తితిదే సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు