కంట్లో రసాయనాలు పడితే ఇలా చేయండి!

ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు పొరపాటున లేదా ప్రమాదవశాత్తు రసాయనాలు, సున్నం, కారం, బ్లీచింగ్‌ పౌడవర్‌ లాంటివి కళ్లలో పడుతుంటాయి

Published : 18 Jul 2021 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు పొరపాటున లేదా ప్రమాదవశాత్తు రసాయనాలు, సున్నం, కారం, బ్లీచింగ్‌ పౌడర్‌ లాంటివి కళ్లలో పడుతుంటాయి. అలాంటప్పుడు కొందరు తెలిసో తెలియకో నాటు వైద్యం చేసి సమస్యను తీవ్రతరం చేసుకుంటారు. అలా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కళ్లను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

కళ్లలో రసాయనాలు పడడం అత్యంత ప్రమాదకరమైన సమస్య. సాధారణంగా కంటిలో ఏం పడినా మంట, వాపు, ఎర్రబడటం, నీరు కారడం వంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని శుభ్రంగా కడగాలి. కంట్లో ప్రమాద కారకాలు పడ్డప్పుడు మనం పాటించాల్సిన ప్రాథమిక సూత్రం ఇది. కంట్లో పడ్డ రసాయనాలు పోయేంత వరకూ కుళాయి కింద గానీ, షవర్‌ కిందగానీ నీళ్లతో బాగా శుభ్రం చేయాలి. ఇంట్లో అందుబాటులో ఉన్న చుక్కల మందులు వేయకూడదు. అలా చేయడం వల్ల మన కళ్లకు మనమే హాని చేసుకున్న వాళ్లమవుతాం. నీళ్లతో కంటిని శుభ్రం చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని