
Published : 26 Aug 2021 15:37 IST
విశాఖ ఫార్మాసిటీలో రసాయనాల లీకేజ్
విశాఖపట్నం: విశాఖ పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఒక కంపెనీ నుంచి రసాయనాలు వెలువడ్డాయంటూ కార్మికులు పరుగులు తీశారు. వాయువులు పీల్చలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమీపంలోని తాడి గ్రామస్థులు కూడా కర్మాగారం ఎదుట ఆందోళన చేశారు. గతంలోనూ తమకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయంటూ మండిపడ్డారు. కర్మాగారం యాజమాన్యం నిబంధనలు పాటించడంలేదంటూ ఆరోపించారు. వారిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పూ లేదని.. తమకు భరోసా ఇవ్వాలని యాజమాన్యాన్ని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి
Tags :