Krishnapatnam: ఆనందయ్య శిష్యబృందంతో చెవిరెడ్డి భేటీ

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య శిష్య‌బృందంతో తితిదే పాల‌క మండలి స‌భ్యుడు, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి భేటి అయ్యారు. తిరుప‌తిలోని తుడా కార్యాల‌యంలో

Updated : 23 Feb 2024 19:50 IST

తిరుప‌తి: నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య శిష్య‌ బృందంతో తితిదే పాల‌క మండలి స‌భ్యుడు, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి భేటీ అయ్యారు. తిరుప‌తిలోని తుడా కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆనంద‌య్య మ‌న‌వడు వంశీకృష్ణ‌, మేన‌ల్లుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంతో చెవిరెడ్డి మాట్లాడారు. ఆనంద‌య్య మందుకు ఆయుష్ అనుమ‌తి వ‌స్తే ఔష‌ధం త‌యారు చేయ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై ఆయ‌న చ‌ర్చించారు. 

అనంతరం చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఆనంద‌య్య ఔష‌ధంపై ప‌రిశోధ‌న జ‌రుగుతోంద‌ని చెప్పారు. నివేదిక వ‌చ్చిన వెంట‌నే తితిదే ఆధ్వ‌ర్యంలో ఔష‌ధం త‌యారు చేస్తామ‌న్నారు. తిరుప‌తిలోనే ఔష‌ధ ప‌రిశోధ‌నకు ల్యాబ్ ఉంద‌ని.. ఆనంద‌య్య మందును ఆ ల్యాబ్‌కు పంపుతున్నామ‌న్నారు. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌)కు సమాంతరంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.  టాక్సిక్‌ స్టడీ, క్లినికల్‌ ట్రయల్స్‌ చేయనున్నట్లుతెలిపారు. త్వ‌ర‌లోనే ఫలితాల నివేదిక వ‌స్తుంద‌ని భావిస్తున్నామని వివ‌రించారు. ఈ మందుకు అనుమ‌తి వ‌స్తే ల‌క్ష‌ల మందికి అందిస్తామ‌ని చెవిరెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని