రమణా.. వీళ్ల టాలెంట్‌కు లైక్ కొట్టాలిరా!
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. కసి, పట్టుదల ఉండాలే కానీ ఎవరైనా ఏమైనా చేయొచ్చు. తమ సత్తా ఏంటో లోకానికి చాటొచ్చు. అదే చేశారు నెల్లూరు కుర్రాళ్లు. చరవాణులే కెమెరాలుగా, చెట్టూ పుట్టలే లొకేషన్లుగా పదేళ్ల లోపు చిచ్చర పిడుగులతో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తీసి మెప్పించారు.
లఘు చిత్రాలతో అదరగొడుతున్న నెల్లూరు కుర్రాళ్లు
ప్రతిభను మెచ్చుకున్న అనిల్ రావిపూడి, రామ్‌లక్ష్మణ్
నెల్లూరు: టాలెంట్ ఎవరి సొత్తు కాదు. కసి, పట్టుదల ఉండాలే కానీ ఎవరైనా ఏమైనా చేయొచ్చు. తమ సత్తా ఏంటో లోకానికి చాటొచ్చు. అదే చేశారు నెల్లూరు కుర్రాళ్లు. చరవాణులే కెమెరాలుగా, చెట్టూ పుట్టలే లొకేషన్లుగా.. పదేళ్ల లోపు చిచ్చర పిడుగులతో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తీసి మెప్పించారు. అద్భుత ప్రతిభతో తెలుగునాట మార్మోగిపోతున్నారు.
నెల్లూరు శివారులో ఉంది భగత్‌సింగ్ కాలనీ. ఆ పక్కనే జనార్దన్‌రెడ్డి కాలనీ. ఈ రెండు మురికి వాడలు. మట్టిలో మాణిక్యాల్లా ఈ వాడలో ఉండే కుర్రాళ్లు మరికొందరు చిచ్చర పిడుగులతో కలిసి లఘుచిత్రాలతో అదరగొడుతున్నారు. సినిమాల్లోని యాక్షన్ సీన్లను తమదైన స్టైల్‌లో తీస్తూ వారెవ్వా అనిపిస్తున్నారు. గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినా.. ‘సరిలేరు నీకెవ్వరు’ ఫైట్‌కు లోకల్ టాలెంట్‌తో దృశ్యరూపం ఇవ్వడం వారికి ఎక్కడ లేని పేరు తెచ్చిపెట్టింది. ఎందుకంటే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద విలన్‌తో మహేష్‌బాబు చేసే పోరాటాన్ని అచ్చు గుద్దినట్లు దించేశారు ఈ సింహపురి చిన్నోళ్లు. ‘రమణ లోడెత్తాలిరా’ అంటూ సాగే మరో ఫైట్‌ను అద్భుతంగా చిత్రించారు.
నెల్లూరు శివారు ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్ కెమెరాతో పదేళ్ల లోపు పిల్లలే నటీనటులుగా తీసిన ఈ రెండు యాక్షన్ సీక్వెన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీరి ప్రతిభను ఏకంగా ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడి, ఫైట్‌మాస్టర్లు రామ్‌లక్ష్మణ్ మెచ్చుకోవడం విశేషం. ఈ బృందంలో ప్రధానమైన 19ఏళ్ల కిరణ్ కుటుంబ పరిస్థితులతో అర్ధంతరంగా చదువు ఆపేశాడు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూనే అభిరుచిని కొనసాగిస్తున్నాడు. దర్శకుడిగా తన ఆలోచనలకు తగిన వాళ్లను ఎంచుకొని మురికి వాడల్లోనూ ప్రతిభకు కొదవ లేదని నిరూపిస్తున్నాడు. కిరణ్ తీసిన షార్ట్ ఫిల్మ్స్‌ను చరవాణిలోనే ఎడిట్ చేసిన లాయక్, మహేష్‌బాబు పాత్రలో లీనమైన మున్నా.. వచ్చి పడుతున్న అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. అద్భుత ప్రతిభతో తెలుగు నాట మార్మోగిపోతున్న సింహపురి చిన్నోళ్లు ఈ ఉత్సాహంతో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్‌తో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Temple Tragedy: ఆలయంలో మెట్లబావి ఘటన.. 35కి చేరిన మృతులు
-
Crime News
సర్ప్రైజ్ గిఫ్ట్.. కళ్లు మూసుకో అని చెప్పి కత్తితో పొడిచి చంపారు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!