Mars: వీడియోలు, ఫొటోలను పంపించిన రోవర్‌

అంగారకుడిపై గత నెల 15న దిగిన చైనా ఉపగ్రహం తైన్ వెన్-1కు చెందిన రోవర్  ఝురాంగ్ అక్కడి నుంచి వీడియోలు, ఫోటోలను పంపింది. రోవర్‌కు అమర్చిన కెమెరా అంగారకుడిపై దృశ్యాలను చిత్రీకరించి భూమిపైకి పంపించింది....

Published : 28 Jun 2021 01:12 IST

బీజింగ్‌: అంగారకుడిపై గత నెల 15న దిగిన చైనా ఉపగ్రహం తైన్ వెన్-1కు చెందిన రోవర్ ఝురాంగ్ అక్కడి నుంచి వీడియోలు, ఫోటోలను పంపింది. రోవర్‌కు అమర్చిన కెమెరా అంగారకుడిపై దృశ్యాలను చిత్రీకరించి భూమిపైకి పంపించింది. పారాచూట్ అక్కడి ఉపరితలాన్ని తాకడం.. రోవర్ దిగిన ప్రదేశం నుంచి దూరంగా ప్రయాణించడానికి సంబంధించిన దృశ్యాలను ఈ కెమెరా బంధించింది. అరుణగ్రహంపై నీరు, మంచు ఉండటంపై మూలాలను శోధించేందుకు చైనా చేపట్టిన ఈ ఉపగ్రహ ప్రయోగంలో భాగంగా రోవర్‌ ఝరాంగ్‌ 90 రోజులు ప్రయాణిస్తుందని అంచనా. ఇందులో ఇప్పటికే 42 రోజులు పూర్తయ్యింది. 236 మీటర్లు ప్రయాణించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని