
Chandrababu: చంద్రబాబుకు కొవిడ్.. త్వరగా కోలుకోవాలంటూ చైనా రాయబారి లేఖ
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుకు భారత్‌లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. చంద్రబాబు కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని చైనా రాయబారి ఆకాంక్షించారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు. కాగా చంద్రబాబు నిన్న కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.