Updated : 21 Jan 2021 04:32 IST

అలజడి తగ్గించేందుకే పర్యటన: చినజీయర్ స్వామి

నందలూరు: ఆంధ్రప్రదేశ్‌లోని పలు దేవాలయాలపై దాడులు జరగడం వాస్తవమేనని.. అలజడి తగ్గించేందుకే ఆలయాలను సందర్శిస్తున్నట్లు త్రిదండి చినజీయర్‌ స్వామి తెలిపారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయం, ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించుకున్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక కనిపించని శక్తులున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల్లో భక్తిభావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యపడుతుందని చెప్పారు. ప్రజలు సైతం ఆలయాల రక్షణ బాధ్యతలు తీసుకోవాలని చినజీయర్‌ స్వామి సూచించారు. పర్యటనలో ఉన్న చినజీయర్‌ స్వామిని ముస్లిం, క్రిస్టియన్‌ ప్రతినిధులు కలిసి కాసేపు మాట్లాడారు. సందర్శన అనంతరం ఆలయాల్లోని విగ్రహాల స్థితిగతులు, సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలిస్తామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..

కమిటీ సభ్యులను కించపరుస్తారా?

బైడెన్‌ ప్రమాణస్వీకారం.. ఆసక్తికర విషయాలు

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని