Samatha Murthy: బుద్ధిని బట్టి మనిషి ఉన్నతమైన ప్రాణి అయ్యాడు: చిన్నజీయర్‌స్వామి

మన ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చేదే మంత్రం అని చిన్నజీయర్‌స్వామి అన్నారు. మంత్రమంటే తరించేవాడిని

Published : 05 Feb 2022 09:37 IST

హైదరాబాద్: మన ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చేదే మంత్రం అని చిన్నజీయర్‌స్వామి అన్నారు. మంత్రమంటే తరించేవాడిని రక్షించేదని ఆయన చెప్పారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అష్టాక్షరీ మహా మంత్ర జపంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాగశాలలోని ప్రధాన మండపంలో 9 మంది జీయర్ స్వాములతో కలిసి అష్టాక్షరీ మహామంత్రాన్ని చిన్నజీయర్ స్వామి జపం చేశారు. ‘బుద్ధిని బట్టి మనిషి ఉన్నతమైన ప్రాణి అయ్యాడు. మనిషికి నిజమైన బలం బుద్ధి బలం. మనిషి అక్షరరాశి, శబ్ద గనినే మంత్రం అంటాం’ అని చిన్నజీయర్‌స్వామి వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని