Telugu News: శ్రీరామచంద్రుని వలే మోదీ వ్రతబద్ధుడు: చినజీయర్‌ స్వామి

సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం

Updated : 05 Feb 2022 19:41 IST

హైదరాబాద్‌: సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ... మోదీ వచ్చాక దేశ ప్రజలు తలెత్తుకుని జీవిస్తున్నారని తెలిపారు. ‘‘రామానుజాచార్యుల అంతటి సుగుణాలు కలిగిన వ్యక్తి మోదీ. శ్రీరామచంద్రుని వలే మోదీ వ్రత బద్ధుడు. రాముడిలా మోదీ కూడా రాజధర్మం ఆచరిస్తున్నారు. ప్రపంచంలో భారత్‌ తలెత్తుకొని ఉండేలా చేస్తున్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ కంకణబద్ధులై ఉన్నారు’’ అని చిన జీయర్‌ స్వామి అన్నారు.

కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రామానుజాచార్యుల స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. మనుషులంతా ఒక్కటేనని  రామానుజాచార్యులు బోధించారని గుర్తు చేశారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని చినజీయర్‌ స్వామి ఏర్పాటు చేశారని కొనియాడారు. సమతా స్ఫూర్తికేంద్రం గొప్ప దివ్యక్షేత్రంగా వెలుగొందుతుందన్నారు. ప్రధాని మోదీ కాశీక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని వివరించారు.  తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని