జీతాలు నిలిపేస్తూ చిత్తూరు కలెక్టర్‌ ఆదేశాలు

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 మండలాల ఉద్యోగులు జీతాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 19 May 2021 01:25 IST

చిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లోని  రెవెన్యూ, పంచాయతీరాజ్, హెల్త్, సచివాలయం, మున్సిపల్ శాఖల ఉద్యోగుల నెల జీతాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆరో విడత ఫీవర్ సర్వేలో ఆయా మండలాల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. జీతాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని