మహిళలూ.. చాక్లెట్ తింటున్నారా?

చాక్లెట్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వివిధ సందర్భాల్లో చాక్లెట్స్‌ తింటూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు చాక్లెట్లను బాగా ఇష్టపడతారు. కానీ, అవి తింటే లావు ఎక్కుతామోనని భయపడి నోరు కట్టేసుకుంటారు. కానీ, ఉదయం పూట మిల్క్‌

Published : 26 Jun 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాక్లెట్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వివిధ సందర్భాల్లో చాక్లెట్స్‌ తింటూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు చాక్లెట్లను బాగా ఇష్టపడతారు. కానీ, అవి తింటే లావు ఎక్కుతామోనని భయపడి నోరు కట్టేసుకుంటారు. అయితే ఉదయం పూట మిల్క్‌ చాక్లెట్‌ తింటే అది బరువు పెరగడంపై ప్రభావం చూపదని, పైగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తూ.. కొవ్వును కరిగిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

మహిళలు ఏయే సమయంలో మిల్క్‌ చాక్లెట్స్‌ తినడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుదనే విషయంపై స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ముర్సియాతో కలిసి బ్రిగ్‌హాం రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. ఇందుకోసం కొంత మంది మహిళలను ఎంచుకున్నారు. ఈ పరిశోధనలో ఉదయం పూట లేదా రాత్రివేళ చాక్లెట్‌ తింటే.. అది బరువు పెరగడానికి దారి తీయదని తేలింది. అంతేకాదు, ఉదయం పూట ఎక్కువ మొత్తంలో చాక్లెట్‌ తింటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గడంతోపాటు శరీరంలోని కొవ్వు కరుగుతుందట. అలా కాకుండా పగటి పూట.. సాయంత్రం వేళ చాక్లెట్‌ తింటే అది ఆకలి, నిద్రపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని