Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగిసింది.

Updated : 24 Sep 2023 18:15 IST

రాజమహేంద్రవరం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం కాన్ఫరెన్స్‌ హాలులోనే చంద్రబాబును రెండ్రోజుల పాటు సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చినట్టు తెలిసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు, శిక్షణ సహా వాటికి సంబంధించి ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదని, అంతా నిబంధనల ప్రకారమే నడిచిందని తేల్చిచెప్పారు. దర్యాప్తు అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఏ నిర్ణయం, ఎందుకు తీసుకున్నామనేది ఎలాంటి శషభిషలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని