AP CID: వాసుదేవరెడ్డి విల్లాలో సీఐడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో శుక్రవారం సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

Published : 21 Jun 2024 22:39 IST

అమరావతి: బెవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో శుక్రవారం సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని విల్లాలో సోదాలు చేసిన అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. జగన్‌ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలున్నాయి. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో కరడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారు. నూతన మద్యం విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలోనే సీఐడీ సోదాలు చేస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని