CJI: శ్రీశైల మల్లన్న సేవలో సీజేఐ దంపతులు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ దంపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ దంపతులు దర్శించుకున్నారు.

Updated : 26 Feb 2023 13:12 IST

శ్రీశైలం ఆలయం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ దంపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ దంపతులు దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సీజేఐ, న్యాయమూర్తులకు దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్‌, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఆర్‌.చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌ లవన్న, అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. 

అనంతరం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ దంపతులు, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ దంపతులు రత్నగర్భ గణపతి స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మహామంగళహారతి సేవలో పాల్గొని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో న్యాయమూర్తులకు అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. సీజేఐ దంపతులకు దేవస్థానం అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించారు. సీజేఐ వెంట ఏపీ రిజిస్ట్రార్‌ జనరల్‌ వై.లక్ష్మణరావు, తెలంగాణ రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుజన, కర్నూలు జిల్లా జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీసామూన్‌, జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జేసీ నిశాంతి తదితరులు ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని