Bapatla: బాపట్ల జిల్లాలో యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 21 Jun 2024 16:33 IST

అమరావతి: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోం మంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం తరఫున అండగా ఉండాలన్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హోంమంత్రి అనిత ఈపూరుపాలెం బయలుదేరి వెళ్లారు.

ఈపూరుపాలెం గ్రామానికి చెందిన యువతిని శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బహిర్భూమికి వెళ్లిన కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి .. వెతుక్కుంటూ వెళ్లగా రైల్వేట్రాక్‌ సమీపంలో ముళ్ల చెట్లలో మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని