Chandrababu: సీఎం చంద్రబాబుతో ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ సమావేశం

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. 

Updated : 24 Jun 2024 21:29 IST

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఛైర్మన్‌ సీఎం చంద్రబాబును కలిశారు. పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట అమరావతిని నిర్లక్ష్యం చేసింది. దీంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాంట్రాక్ట్‌ కంపెనీలు నిర్మాణం కోసం తీసుకొచ్చిన పరికరాలను తరలించేశాయి. దీంతో పూర్తయిన భవనాలు ముళ్లపొదలతో నిండిపోయాయి. మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని పునర్నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోన్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు