Chandrababu: అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. విభజన అంశాలపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ప్రజాభవన్‌ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో భేటీ కానున్నారు.

Updated : 06 Jul 2024 18:46 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎంల సమావేశంలో  చర్చించాల్సిన అంశాలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్‌ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని