CM Chandrababu: హంద్రీనీవా కాల్వపనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు.

Updated : 25 Jun 2024 15:39 IST

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం జెల్లిగానిపల్లె వెళ్లిన చంద్రబాబు... అర్థంతరంగా నిలిచిపోయిన హంద్రీనీవా కాల్వ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. వెంటనే కాల్వ పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

కుప్పం నియోజకవర్గంలో మంగళవారం, బుధవారం సీఎం పర్యటన కొనసాగనుంది. సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బుధవారం ఉదయం ఆర్ అండ్‌బీ అతిథిగృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పీఈఎస్‌ ఆడిటోరియంలో తెదేపా శ్రేణులతో నిర్వహించే సమావేశంలో చంద్రబాబు మాట్లాడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని