AP PRC: ఉద్యోగులకు చేయగలిగినంత చేశాం: సీఎం జగన్‌

రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. కొవిడ్‌, ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లోనూ

Updated : 06 Feb 2022 14:33 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. కొవిడ్‌, ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు చేయగలిగినంత చేశామని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఉద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని.. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. ‘నేను మనస్ఫూర్తిగా నమ్మేదొకటే.. మీరు లేకపోతే నేను లేను’ అని ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. 

సీపీఎస్‌ విషయంలో ఉద్యోగులకు సరైన పరిష్కారం చూపిస్తామని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై చాలా స్టడీ చేస్తున్నామని జగన్‌ చెప్పారు. ఆ సమస్య పరిష్కారంలో ఉద్యోగ సంఘాలనూ భాగస్వామ్యం చేస్తామని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అంశంలో రోస్టర్‌ పద్ధతి ప్రకారం చర్యలు చేపడతామని.. దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వివరించారు. సుమారు 30వేల మంది ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని.. భవిష్యత్‌లో ఆ ఫలాలు వస్తాయని చెప్పారు. మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల నిర్ణయాలు సంతోషాన్ని ఇచ్చాయని భావిస్తున్నట్లు సీఎం అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని