ముగిసిన సీఎం జగన్‌ దిల్లీ పర్యటన

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సీఎం.. నేడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు.

Published : 30 Mar 2023 13:59 IST

దిల్లీ: ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సీఎం.. నేడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రితో సీఎం భేటీ సుమారు అరగంటపాటు కొనసాగింది. పర్యటన అనంతరం సీఎం విజయవాడ బయల్దేరారు.

జగన్‌ దిల్లీ పర్యటనపై సీఎంవో ప్రకటన విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10వేల కోట్లు, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.2,020కోట్లు ఇవ్వాలని అమిత్‌షాను సీఎం కోరినట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు