CM Jagan: రెండ్రోజుల పాటు సీఎం జగన్‌ దిల్లీ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 30, 31 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు. దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొంటారు.

Published : 29 Jan 2023 22:17 IST

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 30, 31 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4గటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6.45 గంటలకు దిల్లీ చేరుకుంటారు. వన్‌ జన్‌పథ్‌ నివాసంలో రాత్రికి బస చేస్తారు. ఈనెల 31న ఉదయం 10.30గంటలకు దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం దిల్లీ నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు