Updated : 05 Jul 2022 15:59 IST

CM Jagan: ‘బైజూస్‌’తో విద్యార్థులకు మెరుగైన విద్య: సీఎం జగన్‌

ఆదోని: పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. 

‘నాడు-నేడు’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న సుమారు 47లక్షల మంది విద్యార్థులకు ఈరోజు శుభదినమని చెప్పారు. రూ.931కోట్లతో విద్యాకానుక కిట్లు అందజేస్తున్నట్లు జగన్‌ వివరించారు. విద్యార్థుల కోసం బైజూస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుని యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చామని చెప్పారు. 8వ తరగతి పిల్లలకు రూ.12వేల విలువైన ట్యాబ్‌ ఇస్తున్నామని.. బైజూస్‌ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని