CM Jagan: గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం జగన్
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు.
అమరావతి: ఏపీ గవర్నర్ (AP Governor) జస్టిస్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer) ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అపెండిసైటిస్ సర్జరీ జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వివరించారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కడుపు నొప్పి సంబంధిత సమస్యతో సోమవారం మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్టు తేలింది. గవర్నర్‌కు రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ విజయవంతంగా నిర్వహించినట్టు మణిపాల్ ఆస్పత్రి ఓ బులిటెన్‌లో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nara Lokesh: ఇదేం అరాచక పాలన..? బండారు అరెస్టును ఖండించిన లోకేశ్
-
Siddharth: అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్
-
Tragedy: ‘మహా’ ఘోరం.. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది శిశువులు సహా 24 మంది మృతి
-
Ts News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎన్ శివశంకర్ ఛైర్మన్‌గా పీఆర్సీ ఏర్పాటు
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’పై స్పందించిన వివేక్ అగ్నిహోత్రి.. ఏమన్నారంటే?