CM Jagan: రాష్ట్రంలో పెట్టుబడులకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ రావడం శుభపరిణామం: జగన్‌

రాష్ట్రంపై నమ్మకం ఉంచి గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో రూ.2వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ ముందుకు రావడం శుభపరిణామమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

Updated : 21 Apr 2022 16:37 IST

బిక్కవోలు: రాష్ట్రంపై నమ్మకం ఉంచి గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో రూ.2వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ ముందుకు రావడం శుభపరిణామమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిమ్‌ పరిశ్రమ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ అంగీకరించిందని చెప్పారు. 

గ్రాసిమ్‌ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుందని జగన్‌ వివరించారు. పరిశ్రమ ఏర్పాటుపై గతంలో గ్రామస్థులు ఆందోళన చెందారని.. కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా పరిశ్రమ నిర్మించేలా చర్యలు చేపట్టామన్నారు. గ్రాసిమ్‌ సంస్థ అందించే సీఎస్‌ఆర్‌ నిధులు స్థానికంగా ఖర్చుచేస్తామని సీఎం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని