CM Jagan: హజ్‌ యాత్రికులను కలిసిన సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా హజ్‌ యాత్రికులు ప్రార్థనలు చేయాలని సీఎం జగన్‌ కోరారు.

Updated : 08 Jun 2023 20:43 IST

గుంటూరు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా హజ్‌ యాత్రికులు ప్రార్థనలు చేయాలని సీఎం జగన్‌ కోరారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని మదర్సాకు విచ్చేసిన సీఎం.. హజ్‌ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులను కూడా వారితో పాటు పంపిస్తున్నామని సీఎం చెప్పారు. అల్లా దీవెనలు రాష్ట్రంపై ఉండాలని హజ్‌ యాత్రికులతో కలిసి సీఎం జగన్‌ నమాజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యేలు రోశయ్య, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

హజ్‌ యాత్రికులకు చంద్రబాబు శుభాకాంక్షలు

తెదేపా అధినేత చంద్రబాబు సైతం హజ్‌ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. నంబూరు మదర్సాలో హజ్‌ యాత్రికులను కలిశారు. చంద్రబాబుతో పాటు హజ్‌ యాత్రికులను కలిసేందుకు వచ్చిన తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు మదర్సా ప్రధాన ద్వారం వద్దే అడ్డుకున్నారు. ముస్లింలకు తప్ప ఇతరులకు లోనికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని