CM Jagan: రాయలసీమ రైతులకు సీఎం జగన్‌ ఆఫర్‌.. ఎకరాకు రూ.30వేలు..!

రాయలసీమ రైతులకు ఏపీ సీఎం జగన్‌ ఓ ఆఫర్‌ ప్రకటించారు. రైతులు ముందుకొస్తే ఏడాదికి ఎకరానికి రూ.30వేలు లీజు చెల్లించేందుకు ప్రభుత్వం..

Updated : 28 Sep 2022 14:32 IST

కొలిమిగుండ్ల: రాయలసీమ రైతులకు ఏపీ సీఎం జగన్‌ ఓ ఆఫర్‌ ప్రకటించారు. రైతులు ముందుకొస్తే ఏడాదికి ఎకరానికి రూ.30వేలు లీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్స్‌ పరిశ్రమను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ మాట్లాడుతూ లీజు అంశాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వమే రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని సౌర, పవన విద్యుత్‌  తయారీ సంస్థలకు ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం మూడేళ్లకోసారి ఐదు శాతం లీజు పెంచుతుందని తెలిపారు. 

ఒక లొకేషన్‌లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూములు సేకరించాలని.. ఈ విషయంలో రైతులను ఒప్పించాలని సీఎం సూచించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించి రైతులు భూములు ఇచ్చేలా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఈ ప్రాజెక్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. గ్రీన్‌కో ప్రాజెక్టులకు రైతులు సహకరించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని