Andhra News: మూడో విడత వైఎస్సార్‌ ఆసరా నిధులు రూ.6,419 కోట్లు విడుదల

మూడో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా నిధులను రూ.6,419 కోట్లను సీఎం జగన్‌ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమచేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన.. బటన్‌ నొక్కి నిధులను విడుదల చేశారు.

Updated : 25 Mar 2023 16:15 IST

దెందులూరు: మూడో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా నిధులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. 78.94 లక్షలమంది లబ్ధిదారులకు ₹6,419 కోట్లు విడుదల చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. మహిళలపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతం తగ్గిస్తూ వస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పొదుపు సంఘాల పనితీరు ఎలా మారిందో కనిపిస్తోందన్నారు. 91శాతానికి పైగా సంఘాలు ఏ గ్రేడ్‌ సంఘాలుగా మార్పుచెందాయని సీఎం వెల్లడించారు. 

సీఎం ప్రసంగిస్తుండగానే జారుకున్న ప్రజలు..

మరోవైపు ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున డ్వాక్రా మహిళలను అధికార పార్టీ నేతలు తరలించారు. సీఎం ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణం నుంచి మహిళలు ఇంటిదారి పట్టారు. కార్యక్రమం పూర్తికాకముందే ప్రజలు బయటకు వెళ్లిపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని