CM Jagan: పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యా వ్యవస్థలో మార్పులు: సీఎం జగన్

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది తమ ప్రభుత్వమేనని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద

Updated : 11 Aug 2022 19:58 IST

బాపట్ల: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది తమ ప్రభుత్వమేనని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద మూడో విడత రూ.694 కోట్ల నిధులను బటన్‌ నొక్కి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉన్నత విద్యకు ఫీజు ఎంత ఉన్నా తమ ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778కోట్లనూ తామే చెల్లించామన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలో 11 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని వివరించారు. 

రాబోయే కాలంలో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన విద్యా వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తున్నట్లు జగన్‌ చెప్పారు. పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యా వ్యవస్థ, విద్యా ప్రణాళికలో మార్పులు తెచ్చినట్లు సీఎం వివరించారు. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వారా చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. గత మూడేళ్లలో విద్యారంగ అభివృద్ధికి రూ.53వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. ఎక్కడా వివక్షకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని